ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం యువతపై చాలా గట్టిగానే ఉంది. దీంతో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు నడిరోడ్డుపైనే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌కు చెందిన ఓ ప్రేమ జంట రీల్స్ పిచ్చితో బైక్ ట్యాంకర్‌పై అమ్మాయిని కూర్చోబెట్టి అబ్బాయి ముద్దులు పెడుతూ.. రొమాన్స్ చేస్తున్న వీడియో రికార్డ్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇది కాస్త కాన్పూర్ పోలీసుల దృష్టికి చేరడంతో వారిపై కేసు నమోదు చేశారు.