సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రంలో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకింది. ఈ ఘటన తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం సాల్వపట్టెడ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఇద్దరు పిల్లలతో బావిలో దూకడం స్థానికులు గమనించారు. తల్లి దేవిని కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఐశ్వర్య (10), అక్షర (3) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.