తిరుమలలో టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం చూపించాడు. ఏకంగా శ్రీవారి హుండీలోనే దొంగతనానికి పాల్పడ్డాడు. ఆదివారం ( జనవరి 12, 2025 ) శ్రీవారి హుండీలోని 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకెళ్తుండగా పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు.దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అగ్రిగోస్ కి చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్యగా గుర్తించారు పోలీసులు. పెంచలయ్యను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు తిరుమల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.తిరుమలలోని బాలాజీనగర్ వినాయక ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని హుండీ నుంచి నగదు దొంగలించారు దుండగులు. హుండిలోని నగదు ఎత్తుకెళ్లిన దుండగులు.. ఖాళీ హుండీలను ప్రక్కనే వున్న కమ్యూనిటీ హాల్ వద్ద వదిలేసి వెళ్లారు.కమ్యూనిటీ హాల్ లో హుండీలను తీసుకెళ్లి చోరీకి పాల్పడినాట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆలయ అధికారులు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలింపు చేపట్టారు.ఇటీవలే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర తొక్కిసలాట జరగటం.. శనివారం ( జనవరి 11, 2025 ) భక్తులపైకి అంబులెన్స్ దూసుకెళ్ళటం.. ఇవాళ ( జనవరి 12, 2025 ) తిరుమలలో వరుస దొంగతనాలు జరగటం పట్ల శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.