చీరాల మండలంలోని ఎన్ ఆర్ పి ఎం హైస్కూల్ సమీపంలోని శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్బంగా వివేకానంద విగ్రహానికి చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాల కొండయ్య హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశ ఖ్యాతిని, మన హైందవ సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయ వ్యక్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు.