ఇంగ్లాండ్‌తో జనవరి 22 నుంచి జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ శనివారం (జనవరి 11) జట్టును ప్రకటించింది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ తర్వాత గాయంతో భారత జట్టుకు దూరమైన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20లకు రిటైర్మెంట్ పలకడంతో యువ ఆటగాళ్లతో కూడిన జట్టును భారత్ ఎంపిక చేసింది. ప్రధాన వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ ఉండగా.. అతడికి బ్యాకప్‌గా ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది.
భారత్ - ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్:
తొలి టీ20: జనవరి 22 (కోల్‌కతా)
రెండో టీ20: జనవరి 25 (చెన్నై)
మూడవ టీ20: జనవరి 28 (రాజ్‌కోట్)
నాలుగవ టీ20: జనవరి 31 (పుణె)
ఐదవ టీ20: ఫిబ్రవరి 02 (ముంబై)
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)
ఇంగ్లాండ్ జట్టు:జోస్ బట్లర్ (కెప్టెన్), మార్క్ వుడ్, ఫిల్ సాల్ట్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్‌టన్, బెన్ డకెట్, బ్రైడన్ కార్సే, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, రెహాన్ అహ్మద్.