ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్.. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందులో భాగంగా టీ20 సిరీస్ కోసం శనివారం రాత్రి సూర్యకుమార్ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కానీ వన్డే జట్టుపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. వాస్తవానికి ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో పాల్గొనే ఆటగాళ్లనే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై క్లారిటీ లేకపోవడంతో జట్టు ఎంపిక ఆలస్యమవుతోందన తెలుస్తోంది.
ముఖ్యంగా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. వెన్నునొప్పి కారణంగా అతడు సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. అతడి ఫిట్‌నెస్‌పై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ.. ఐసీసీని మరికొన్ని రోజులు సమయం కోరే అవకాశం ఉంది. అలాకాకుండా జట్టును ప్రకటించాక కూడా అందులో మార్పులు చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. దీంతో ఆదివారమే భారత జట్టు ప్రకటన ఉంటుందా అనేది ఉత్కంఠగా మారింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం ఉంది. మరో సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజాకు చోటు ఇస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాలు కూడా వన్డే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఫిట్‌నెస్ నిరూపించుకున్న మహమ్మద్ షమీ.. సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడు ఆడనున్నాడు.