ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలో దిగే భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. జనవరి 19లోపు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. భారత్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి.
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. అయితే భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీమిండియా ఓపెనర్‌గా రోహిత్ శర్మకు జతగా.. శుభ్‌మన్ గిల్‌కు బదులు యశస్వి జైస్వాల్‌ను తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు కఠినమైన సవాలేనన్నాడు. 'నేనే సెలెక్టర్ అయితే యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేస్తాను. ఎందుకంటే అతను ఎడమచేతి వాటం బ్యాటర్. అతన్ని ఎంపికతో జట్టుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే ప్రత్యర్థి బౌలర్లు కాస్త అసౌకర్యానికి గురవుతారు. అంతేకాకుండా కుడిచేతి బ్యాటర్లకు వేసే అద్భుతమైన బంతి.. ఎడమ చేతి బ్యాటర్లకు డౌన్ ద లెగ్ వెళ్లి వైడ్‌గా మారుతోంది. జట్టుకు ఒక పరుగు అదనంగా లభించనుంది.
లెఫ్ట్ రైట్ కాంబినేషన్..
ఎక్స్‌ట్రా బాల్ కూడా దొరుకుతుంది. కాబట్టి లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌తో జట్టును నిర్మించాలి. మిడిలార్డర్‌లో కూడా లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉండేలా చూసుకోవాలి. రిషభ్ పంత్‌కు తగ్గట్లు మిగతా బ్యాటర్లను తీసుకోవాలి. వన్డేల్లో మిడిలార్డర్ అత్యంత కీలకం. వన్డే ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ మెరుగైన ప్రదర్శన చేశాడు.
కెప్టెన్‌గా రోహిత్.. జైస్వాల్‌కు నో ఛాన్స్! ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టు ఇదే!"కెప్టెన్‌గా రోహిత్.. జైస్వాల్‌కు నో ఛాన్స్! ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టు ఇదే!"
శ్రేయస్ అయ్యర్ కూడా బాగానే ఆడాడు. అతనికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అతనికి పెద్దగా అవకాశాలు దక్కలేదు. నేను అయితే అతన్ని ఎంపిక చేస్తా. నా జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు నాలుగో స్థానం ఇస్తాను. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌ను ఆరో స్థానంలో ఆడిస్తాను. ఇటీవల సెంచరీలు బాదిన సంజూ శాంసన్‌ను కూడా విస్మరించలేం. అతనికి జట్టులో చోటిస్తా.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.