క్యాష్ ప్రైజ్ వచ్చిందని, అకౌంట్‌లో డబ్బులు జమ అయినట్లు మెసేజ్ చేసి లింక్ ఓపెన్ చేయండని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాటికి మనం మోసపోవద్దంటే గుర్తుతెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వస్తే అస్సలే తిరిగి చేయకూడదు. మన ఫోన్‌కు ‘+91’ నెంబర్ నుంచి కాకుండా ఇతర దేశాల కోడ్‌లతో కూడిన నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వస్తే, మనం కాల్ బ్యాక్ చేయగానే మన అకౌంట్ ఖాళీ అవ్వడం లాంటివి జరుగుతుంది.ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చుకుంటూ ఈ కేటుగాళ్లు గంటల వ్యవధిలోనే జీవితాలను రోడ్ల మీదకు తెచ్చేస్తున్నారు. సామాన్యులే కాదు, ఉన్నత చదువులు చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులూ సైబర్ వలలో చిక్కుకుని బాధితులుగా మారడం విస్తుపోయేలా చేస్తోంది. ఇలా అంతర్జాతీయ నంబర్ల నుంచి కాల్స్ చేసి మభ్యపెట్టి ఖాతాలు కొల్లగొడుతున్న కేటుగాళ్లు ఇప్పుడు మిస్డ్ కాల్స్‌తో టెలికాం యూజర్లను బోల్తా కొట్టిస్తున్నారు.