ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు

national |  Suryaa Desk  | Published : Thu, Jan 16, 2025, 11:51 AM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భారీగా జనం పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో విమానాల టికెట్ ధరలు గణనీయంగా పెరిగాయి. ట్రావెల్‌ పోర్టల్‌ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం, గతేడాది ఈ సమయంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌ టికెట్‌ ధర రూ.2,977గా ఉంది. ఆ ధర ఇప్పుడు ఏకంగా 498 శాతం పెరిగి రూ.17,796గా కొనసాగుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు వన్‌ వే బుకింగ్‌ల సరాసరిన లెక్కగట్టడంతో ఈ మొత్తం తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com