దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత మూడు రోజుల నుంచి వరుసగా లాభాల్లో మొదలైన మార్కెట్లు అంతర్జాతీయ బలహీన సంకేతాలతో శుక్రవారం నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 367 పాయింట్ల నష్టంతో 76,706 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 91 పాయింట్లు కుంగి 23,220 వద్ద కదలాడుతోంది.