పరిగి మండలంలోని శ్రీరంగరాజుపల్లి గ్రామంలో మాజీ మంత్రి, శ్రీసత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు కే. వి. ఉషాశ్రీచరణ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గుడ్ మార్నింగ్ అంటూ ప్రజలతో మమేకమై కాఫీ త్రాగుతూ ప్రజలందరినీ పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కురుబ నరసింహమూర్తి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.