తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం పోలీసుల పహార మధ్య అనుకున్న టైంకే ప్రారంభమైంది. ఎంపీడీవో గంగయ్య ఆధ్వర్యంలో ఎంపీపీ దస్తగిరి అధ్యక్షతన శుక్రవారం ఉదయం11కు మండల సర్వసభ్య సాధారణ సమావేశాన్ని అధికారులు ప్రారంభించారు. కూటమి నేతలు సమావేశాన్ని అడ్డుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడంతో, సమావేశాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నారు.