టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని ప్రచారం జరిగింది. త్వరలోనే పెళ్లి తేదీని ఖరారు చేస్తారని.. అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను ప్రియా సరోజ్ తండ్రి తుఫాని సరోజ్ ఖండించారు. దీంతో రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ల పెళ్లి వార్తలకు ఫుల్స్టాప్ పడింది. అయితే ఈ సమయంలోనే ఆయన ఓ ట్విస్ట్ ఇచ్చారు. రింకూ సింగ్‌కు తన కుమార్తె ప్రియా సరోజ్‌తో ఎంగేజ్మెంట్ జరిగిందనే.. వార్తలను ఖండిస్తూనే ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు తుఫాని సరోజ్. పెళ్లి సంబంధం గురించి రింకూ సింగ్ కుటుంబం తమను సంప్రదించిందని చెప్పుకొచ్చారు. రింకూ సింగ్‌కు ప్రియా సరోజ్‌కు పెళ్లి చేయాలని ప్రతిపాదనను తమ వద్దకు తీసుకొచ్చారని తుఫాని వెల్లడించారు.
అయితే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తమ కుటుంబంలో మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. తుఫాని సరోజ్ స్పందనతో రింకూ సింగ్ పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. కానీ ప్రతిపాదన మాత్రం వచ్చిందని తెలిసింది. మరి రింకూ సింగ్ కుటుంబం చేసిన పెళ్లి ప్రతిపాదనపై ప్రియా సరోజ్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
కాగా 27 ఏళ్ల రింకూ సింగ్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది.. ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఏకంగా భారత జట్టులో చోటు సంపాదించాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. భారత జట్టులోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్‌ను ఐపీఎల్ కారణంగా కోటీశ్వరుడయ్యాడు. ఐపీఎల్ 2025కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ.13 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. ఐపీఎల్‌తో వచ్చిన డబ్బుతో రింకూ యూపీ ఓ విల్లాను కొనుగోలు చేశాడు.
ఇక ప్రియా సరోజ్ గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ లోకసభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. 25 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికైన ఆమె.. లోక్‌సభ ఎంపీగా గెలిచిన రెండో పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియేట్ చేశారు. ప్రియా సరోజ్ తండ్రి తుఫాని సరోజ్ మచ్లిషహర్ నియోజకవర్గం నుంచే 3 సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు.