యూపీలోని బహ్రైచ్లో తాజాగా విషాదం జరిగింది. ఓ పులి పొలంలో ప్రవేశించి రైతుపై దాడి చేసి చంపేసింది. బాధితుడు పొలంలో కాపలాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం అతని మృతదేహం ముక్కలు ముక్కలుగా కనిపించింది.
ఈ భయానక దృశ్యాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్రజలు తమ ఇళ్లలో దాక్కోవడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.