స్టాక్ మార్కెట్ సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. లాభాలతో మొదలైనప్పటికీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనుండడంతో షేర్ హోల్డర్స్ ఆచితూచి స్పందిస్తున్నారు. దీంతో సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 76,635 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ మాత్రం 15 పాయింట్ల నష్టంతో 23,186 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కోటక్ మహీంద్రా, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.