కూటమి గెలుపు దేశంలోనే సరికొత్త రికార్డు అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అన్ని రంగాల్లో చంద్రబాబే మనకు స్ఫూర్తి అని చెప్పారు. చంద్రబాబు గొప్ప విజనరీ నాయకుడు అని కొనియాడారు. చంద్రబాబు హయాంలోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించారు. ఓడిన చోటే గెలవాలనే కసి ఉన్న నాయకుడు లోకేష్ అని తెలిపారు. మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో గెలిచారని అన్నారు. తెలుగు ప్రజలు సాధించలేనిదంటూ ఏదీలేదన్నారు. తెలుగు ప్రజలు ఏ దేశంలోనైనా రాణిస్తారని రామ్మోహన్ చెప్పుకొచ్చారు. కూటమి గెలుపులో ఎన్‌ఆర్‌ఐల పాత్ర కీలకమని రామ్మోహన్ పేర్కొన్నారు.