విజయవాడ స్వరాజ్ మైదానంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం భావితరాలకు స్ఫూర్తిదాయకమని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, వెలంపల్లి శ్రీనివాస్, ఎన్‌టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, పలువురు పార్టీ సీనియర్ నాయకులు మంగళవారం సందర్శించి నివాళులర్పించారు.