పెట్టుబడుల ఆకర్షణ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి దావోస్ వెళ్లిన తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ సొంత భజన చేసుకోవడమే కాకుండా, వారు చెప్పే పచ్చి అబద్ధాలు చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని వైయస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. గతంలో 2014–19 మధ్య నాలుగుసార్లు దావోస్ వెళ్లిన చంద్రబాబు, ఆర్భాట ప్రకటనలు, ప్రచారం మినహా సాధించేదేమీ లేదని, రాష్ట్రానికి కనీసం ఒక్క పెట్టుబడి కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు. అందుకే ఈసారైనా తప్పుడు ప్రకటనలతో మోసం చేయకుండా, పెట్టుబడుల విషయంలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి కోరారు. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో దావోస్ వెళ్లిన తండ్రీకొడుకులు అసలు విషయం పక్కన పెట్టి ఒకరికొకరు భజన మొదలుపెట్టారు. మంత్రులు లోకేశ్‌ను పొగడటం.. లోకేశ్.. చంద్రబాబుని పొగడటమే సరిపోయింది. అది చాలదన్నట్టు ఇద్దరూ కలిసి వైయస్ జగన్‌ని తిట్టడం. ఈ మాత్రం దానికి కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి దావోస్ దాకా వెళ్లడం దేనికని జనం తిట్టుకుంటున్నారు అని తెలిపారు .