ఫీజుల పేరుతో నారాయణ, చైతన్య కాలేజీలు ఇష్టారాజ్యంగా విద్యార్థులను వేధించడమే కాకుండా కనీసం క్యాంపస్లో అడుగు పెట్టనీయకుండా గేటు బయటకు తోసేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజులు ఏకంగా 40 శాతం పెంచారని, అక్రమ వసూళ్లను నియంత్రించడానికి కమిటీని ఏర్పాటు చేయాలన్న కనీస జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేకపోయిందని ఆయన గుర్తు చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బాధిత విద్యార్థుల తరఫున కాలేజీల వద్ద వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.