ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 22, 2025, 03:40 PM

భారత స్పేస్​ రీసెర్చ్​ డెవలప్​మెంట్​లో భాగంగా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం శ్రీహరికోటలోని సతీష్​ ధావన్​ స్పేస్ సెంటర్​లో రూ.3,985 కోట్లతో మూడో లాంచ్​ ప్యాడ్​ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం శ్రీహరికోటలో రెండు లాంచ్​ ప్యాడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి బ్యాకప్​గా మూడో లాంచ్​ ప్యాడ్​ను ఉపయోగించనున్నారు. ఈ లాంచ్​ ప్యాడ్​ న్యూ/ నెక్స్ట్​ జనరేషన్​ లాంచ్​ వెహికిల్​(ఎన్​జీఎల్​వీ) ప్రోగ్రామ్​ సహా ఇస్రో భవిష్యత్తు మిషన్లకు సహాయపడనున్నది.    కేవలం నెక్స్ట్​ జనరేషన్​ లాంచ్​ వెహికిల్(ఎన్​జీఎల్​వీ) మాత్రమే కాకుండా సెమీ క్రయోజనిక్​ స్టేజ్​తో లాంచ్​ వెహికిల్​ మార్క్–3 వాహనాలకు, ఎన్​జీఎల్​వీ స్కేల్​ అప్​ కాన్ఫిగరేషన్లను సపోర్ట్​ చేసేలా డిజైన్​ చేయనున్నారు. 


  2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం(బీఏఎస్)ను నెలకొల్పడం, 2040 నాటికి చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేపట్టాలనే బృహత్​ లక్ష్యాలు ప్రస్తుతం ఇస్రో ముందు ఉన్నాయి. అందుకే, అంతరిక్ష నౌకల లాంచ్​కు అన్ని విధాలా సరిపోయేలా మూడో లాంచ్​ ప్యాడ్​ను నాలుగేండ్ల వ్యవధిలో నిర్మించనున్నారు.    ప్రస్తుతం ఇస్రో వద్ద దిగువ భూకక్ష్యలో 8,000 టన్నులు గల వ్యోమనౌకలను ఉంచగల సామర్థ్యం ఉన్నది. ప్రస్తుతం దిగువ భూ కక్ష్యలో 30,000 టన్నులు గల వ్యోమనౌకలను ఉంచగల సామర్థ్యంతో మూడో లాంచ్​ప్యాడును నిర్మించనున్నారు.  ఇండియన్​ స్పేస్​ రీసెర్చ్​ ఆర్గనైజేషన్​ 91 మీటర్ల ఎత్తులో నెక్స్ట్​ జనరేషన్​ లాంచ్​ వెహికిల్(ఎన్​ఎల్​జీవీ)ని కూడా అభివృద్ధి చేస్తున్నది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com