గత ఐదేళ్లల్లో తన కేసులు కొట్టివేయించుకు నేం దుకు జగన రాష్ర్టాన్ని తాకట్టుపెట్టారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ విమర్శించారు. మంగళవారం అనంతపురం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ పట్నాన్ని రాజధాని చే స్తానంటూ జగన ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. తన కేసులను మాఫీ చేయించుకునేం దుకు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమయ్యాడని దుయ్యబట్టారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆర్నెల్లలోపే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ వేశారన్నారు. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమితషాతో మాట్లాడి ప్రైవేటీకరణ ఆపడంతో పాటు రూ.11,440 కోట్లు ప్యాకేజీని తీసుకొచ్చారని అన్నారు. వెంటకశివుడు యాదవ్ మాట్లాడుతూ... గతంలో తనపై ఉన్న కేసుల నుంచి విముక్తి కల్పించాలని, అవసరమైతే రాష్ర్టాన్ని తాకట్టుపెడతానని జగన ఢిల్లీ చుట్టూ తిరిగేవాడన్నారు. సీఎం చంద్రబాబు అందుకు భిన్నంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతి సారీ ఏపీకి కేం ద్రం గుడ్ న్యూస్ చెప్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గాజుల ఆదెన్న, జిల్లా ప్రచార కార్యదర్శి కూచి హరి పాల్గొన్నారు.