ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల దాటికి కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. తొలి ఓవర్లోనే విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసి అర్ష్‌దీప్ సింగ్ భారత్‌కు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఆ తర్వాత మళ్లీ మూడో ఓవర్లో బెన్ డకెట్‌ను అర్ష్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఓవరాల్‌గా భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.