పెళ్లికి కొన్ని నిమిషాల ముందు వరుడి కుటుంబానికి వధువు భారీ షాక్ ఇచ్చింది. బంగారు నగలతో పరారైంది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శాండిలోని నవాబ్‌గంజ్‌కు చెందిన నీరజ్ గుప్తాకు ప్రమోద్ అనే బాబా పరిచయమయ్యాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్న అతడికి షాహాబాద్‌కు చెందిన మహిళను పరిచయం చేసి పెళ్లి ఫిక్స్ చేశాడు. అయితే, కొంత సేపట్లో పెళ్లనగా వరుడి కుటుంబం ఇచ్చిన రూ..3.5 లక్షల విలువైన బంగారు నగలతో వధువు పరారైంది.