బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి గెలిచిన జేడీయూ ఎమ్మెల్యే మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో పార్టీ అధినేత నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అందరూ భావించారు.కానీ అంతలోనే నితీశ్ కుమార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించిన ఎమ్మెల్యేపై వేటు వేశారు. పార్టీ అధిష్ఠానం ఆ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.2022లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గాను బీజేపీ 32, జేడీయూ 6 స్థానాల్లో విజయం సాధించింది. జేడీయూకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీజేపీలో చేరారు. దీంతో జేడీయూకు ఒక ఎమ్మెల్యే మాత్రమే మిగిలాడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకున్నాడు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో నితీశ్ కుమార్ ఆయనపై బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.