కౌలు చేసుకుని జీవనం సాగిస్తున్న తెప్పల ఢిల్లీరావు (57) రామకృష్ణాపురం పవర్‌గ్రిడ్ రోడ్డులో ఉన్న అదే పొలంలో విగతజీవి గా మారిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అయితే భర్త మృతిపై అను మానాలున్నాయని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అందరితో కలివిడిగా, తలలో నాలుకగా ఉండే ఢిల్లీరావు పలాస మండలం నీలావతి గ్రామంలో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఎక్స్కవేటర్, ట్రాక్టర్లు నడుపుతూ మిగిలిన సమ యంలో కౌలుకు తీసుకున్న పొలం సాగుచేస్తూ ఆవులను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. రామకృష్ణాపురం గ్రామానికి సమీపంలో కౌలు భూములున్నాయి. వీటి విషయంలో కాశీబుగ్గకు చెందిన రియల్ ఎస్టేట్‌దారులు, ఓ వైద్యునితో ఢిల్లీరావుకు తగాదాలున్నాయి. ఈ వ్యవహారంపై మూడు పర్యాయాలు వారితో ప్రజాసంఘాల నా యకులు మధ్యవర్తిత్వం వహించినా వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఢిల్లీరావు ఇంటి నుంచి బైక్‌పై రామకృష్ణాపురం భూముల వద్దకు వెళ్లాడు. రాత్రి 9 గంటలైనా తిరిగి రాకపోవడంతో ఆయన భార్య ఫోన్ చేసినా స్పం దించలేదు. ఈ విషయాన్ని ఆమె రామకృష్ణాపురంలో ఉంటున్న ఆయన బంధువు సొర్ర ప్రశాంత్‌కు చెప్పడంతో ఆయన పొలాల్లో వెతుకుతుండగా మంటల్లో కాలి పోతున్న ఢిల్లీరావును గుర్తించాడు. పొలాలకు గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ తీగలు అమర్చడంతో అవి తాకి మృతిచెందినట్లు సమాచారం అందిం చడంతో రాత్రి 11 గంటలకు గ్రామస్థుల సహకారంలో ఢిల్లీరావు మృతదేహాన్ని గుర్తుపట్టి పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రశాంత్ ఢిల్లీరావును వెతికే క్రమంలో ఆ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులున్నారని, వారు అక్కడ నుంచి విద్యుత్ తీగలను తొలగించి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం వేకువజామున ఘటనా స్థలానికి కాశీబుగ్గ పోలీసులు చేరుకొని ఢిల్లీరావు మృతదేహానికి పలాస ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.