అంబేద్కర్ స్మృతి వనాన్ని అమరావతిలో కట్టాలని 2014లో తొలుత నిర్ణయించామని ప్రభుత్వం విప్, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. జగన్ ప్రభుత్వం అమరావతి విచ్ఛిన్నం చేసి బెజవాడలో విగ్రహాన్ని పెట్టారన్నారు. అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు అనేక ఆరోపణలు వచ్చాయని చెప్పారు. అంబేద్కర్ స్మృతి వనం మరింత అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిదన్నారు. ఇంకా చేయాల్సిన పనులు ఏం ఉన్నాయనేది సమీక్ష చేస్తామని చెప్పారు. ఈ సమీక్షలో నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.