రంగం ఏదైనా.. భారతీయులదే విజయమని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళవారం దావోస్ సీఐఐ సెషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. దావోస్‌లో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. WEF సదస్సులో పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు అవుతున్నారు. సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వంద దేశాల్లో తెలుగు ప్రజలు సేవలు అందిస్తున్నారని చెప్పారు. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా తెలుగు వారికి ఉందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ విధానమన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఫ్యూయల్ రంగంలో అగ్రగామిని చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు.ఏపీలో రెండో తరం సంస్కరణలు ప్రారంభించామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్, ఏపీ పారిశ్రామికవేత్తలు ఉన్నారని అన్నారు. ప్రపంచ వేదికపై భారతీయులు గొప్పగా రాణిస్తున్నారని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. 2047 నాటికి భారత్ నెంబర్ వన్‌గా మారుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.