ఉత్తరాంధ్ర మణిహారం విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అరసవల్లి నగరంలోని విశాఖ-ఎ కాలనీలో గల తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో కేంద్ర ప్రభుత్వం రూ.11,400కోట్ల ప్యాకేజీని ప్రకటించిందన్నారు. విశాఖ ఉక్కుకు చంద్రబాబు పూర్తి భరోసా ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు వినే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింతు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.