పీఎం అవార్డ్స్ కోసం తగిన ప్రతిపాదనలతో వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఒంగోలు స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం సాయంత్రం సం బంధిత అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 2022 ఏప్రిల్ నుంచి 2024 డిసెంబరు ఆఖరు వరకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికలను రూపొందించాలన్నారు. పీఎం అవార్డుల కోసం మొత్తం మూడు కేటగిరీలలో 14 అంశాలకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. హర్ ఘర్ జల్ యోజన, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, పీఎం విశ్వకర్మ, ప్రధానమంత్రి ఆవా్‌సయోజన, పీఎం స్వా నిధి, అంగన్‌వాడీ, పోషన్ అభియాన్, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, పీఎం సూర్య ఘర్ ముఫ్త్‌బిజిలి యోజన, మిషన్ ఇంద్రధనస్సు, రైతులు, మత్స్యకారులు, పశుపోషకులకు కిసాన్ క్రిడెట్ కార్డుల పథకం అమలు చేస్తున్న వివరాలను నమోదు చేయాలని చెప్పారు. యాస్సిరేషనల్ బ్లాక్ అభివృద్ధి కింద వైపాలెం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులను, వినూత్న కార్యక్రమాల కింద జిల్లాలో అమలు చేస్తున్న బంగారుబాల్యం, మార్గదర్శిని కార్యక్రమాలను కూడా సమగ్రంగా నివేదించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు డాక్టర్ టి. వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ రెడ్డి, బేబి రాణి, కిరణ్‌కుమార్, హేనాసుజన్, కట్టా వెంకటేశ్వర్లు, డీపీఎం మాధూరి, సీపీవో వెంకటేశ్వర్లు, డీసీహెచ్ సూరిబాబు పాల్గొన్నారు.