విజయనగరం జిల్లా, లక్కవరపుకోట మండలంలోని రేగ గ్రామానికి చెందిన నెక్కల దేముళ్లు (44) మంగళవారం గ్రామానికి సమీపంలోని నెక్కల వారి కల్లాల్లో చింతచెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఏఎస్‌ఐ శ్రీనివాస రావు తెలిపారు. స్థానిక సర్పంచ్, వీఆర్వోలు తెలిపిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట పీహెచ్‌సీకి మృత దేహాన్ని తరలించామన్నారు మృతుడికి భార్య సూరీడమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నా రన్నారు. మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. భార్య సూరీ డమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.