ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కౌట్స్ & గైడ్స్ కు ప్రత్యేక అభినందనలు...జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి

Education |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2025, 04:17 PM

పెద్దపల్లి జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి స్కౌట్స్ & గైడ్స్ తృతీయ తోఫాన్ టెస్టింగ్ క్యాంప్ లో పాల్గొని ఉత్తీర్ణులైన స్కౌట్స్ & గైడ్స్ ను జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ప్రత్యేకంగా అభినందించారు.
బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా ఎంపికైన 65 మంది స్కౌట్స్ & గైడ్స్ కు జిల్లా విద్యాశాఖ అధికారి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.హైదరాబాద్ లోని రాజ పురస్కార్ టెస్టింగ్ క్యాంపులో  పాల్గొన్న స్కౌట్స్ & గైడ్స్ ను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా సెక్రెటరీ సూర్యదేవర జ్యోతి, జిల్లా స్కౌట్స్ & గైడ్స్  కమిషనర్ జె రవీందర్,ఎల్.వి.లక్ష్మి,స్కౌట్స్ & గైడ్స్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com