500 ఏళ్లుగా ఎదిరి చూసిన హిందూ బాంధవుల కలలు అయోధ్య రామ మందిర నిర్మాణంతో కళ సాకారం జరిగిందని సీతారాం హనుమాన్ మందిర ప్రదాన అర్చకులు క్రిష్ణామాచార్యులు అన్నారు. మండల పరిధిలోని మాచినపల్లి సీతారాంపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయంలో చాలీసా యాగ హోమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి నేటికీ సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో అయోధ్యలో మొదటి వార్షికోత్సవం జరుగుతున్న తరుణంలో ఇక్కడ హనుమాన్ దేవాలయంలో హనుమాత్ చాలీసాయాగాన్ని నిర్వహించామని తెలిపారు. ఇలాంటి యాగాలు చేయడంతో పాడి పంట పశుపక్ష్యాదులు సుభిక్షంగా ఉంటాయని అలాగే గ్రామాల ప్రజలు ఆయురారోగ్యాలతో విరజిల్లుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమరేందర్ రెడ్డి-శ్రుతి, తూప్రాన్ టాటా కాఫీ కంపని వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్-రాణీ, ఆలయ ధర్మకర్త రాముగౌడ్-ప్రవళిక, ఎల్లారెడ్డి-శ్వేత, బాలక్రిష్ణ, దుద్దెడ మహేష్ తదితరులు పాల్గొన్నారు..