దావోస్లో మూడో రోజు హైన్కెన్ సీఈఓ డెన్ బ్రింక్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో బీరు తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. విశాలమైన నౌకాశ్రయాలు మరియు మౌలిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ దక్షిణాసియాలో హీనెకెన్ కార్యకలాపాలకు ఒక వ్యూహాత్మక ప్రదేశం అని లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనల ఆధారంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని బ్రింక్ హామీ ఇచ్చారు.