క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలిసారిగా 1998లో ప్రారంభం అయింది. అప్పట్లో దీన్ని ఐసీసీ నాకౌట్ ట్రోఫీగా పిలిచేవారు. తొలి ఎడిషన్ కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇచ్చింది. రెండో ఎడిషన్ 2000లో కెన్యాలో జరిగాయి. అయితే మొదటి ఛాంపియన్స్ ట్రోఫీని న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. తుదిపోరులో టీమిండియాను ఓడించి న్యూజిలాండ్ ట్రోఫీని సాధించింది. 2002 నుంచి ఈ ట్రోఫీని మినీ వరల్డ్ కప్ గా మార్చారు. 2002లో శ్రీలంక, భారత్ రెండూ కలిసి ట్రోఫీని పంచుకున్నాయి. వర్షం కారణంగా రెండు సార్లు మ్యాచ్ కు అంతరాయం కావడంతో ఇద్దరినీ విజేతగా ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన వారు..
న్యూజీలాండ్ మాజీ పేసర్ ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు 17 మ్యాచ్ లు ఆడి 28 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్ యావరేజ్ 17.25గా ఉంది. 4/30 తన బెస్ట్ పెర్ఫామెన్స్ గా ఉంది. 2013లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కైల్ మిల్స్ ఈ ఘనత సాధించాడు.
శ్రీలంక లెజెండరీ క్రికెటర్ మత్తయ మురళీధరన్.. ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 17 మ్యాచ్ లు ఆడి 24 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాక మురళీధరన్ బెస్ట్ ఎకానమీ రేటును కలిగి ఉన్నాడు. అతని ఎకానమీ రేటు ఓవర్ కు 2.78 గా ఉంది. ఈ టోర్నమెంట్ లో ముత్తయ ప్రతి 15.10 బాల్స్ కు ఓ వికెట్ సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చాంఫియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల లిస్టులో మురళీధరన్ ఏకైక స్పిన్నర్ కావడం విశేషం.
ఆస్ట్రేలియా ఫాస్టెస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా ఈలిస్ట్ లో ఉన్నాడు. మొత్తం 4 టోర్నమెంట్స్ ఆడిన బ్రెట్ లీ మొత్తం 22 వికెట్లు పడగొట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ టోర్నీలో అతడి బెస్ట్ బౌలింగ్ 3/38.. 2002లో న్యూజిలాండ్ పై సాధించాడు.
ఆస్ట్రేలియా లెజెండరీ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఐదవ స్థానంలో ఉన్నారు. కేవలం 12 మ్యాచ్ లు ఆడిన మెక్ గ్రాత్ 21 వికెట్లు పడగొట్టాడు. అతడి బెస్ట్ పెర్మామెన్స్ 5/37గా ఉంది. 2002 న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మెక్ గ్రాత్ ఈ గణత సాధించాడు. అయితే ఈ ఐదుగురిలో అత్యధిక సార్లు 5 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా మెక్ గ్రాత్ నిలిచాడు.