ఉబర్, ఓలా సంస్థలపై ఇటీవల ఫిర్యాదులు ఎక్కువ కావడంతో కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ స్పందించింది. ఆ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
ఈ తరహా యాప్‌లలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ అనే తేడా మాత్రమే కాకుండా.. ఫోన్ రేటును బట్టి కూడా ధరల్లో తేడా ఉంటోందని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఉబర్, ఓలా సంస్థలను వినియోగదారుల మంత్రిత్వశాఖ ఆదేశించింది.