కర్నూలు జిల్లా కోర్టు పోక్సో కేసులో సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు 2021లో కత్తితో బెదిరించి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసును విచారించిన కోర్టు దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.