రాయల్ ఎన్ఫీల్డ్, తన కొత్త మోడల్ స్క్రామ్ 440ను ఇండియన్ మార్కెట్లో రూ.2.08 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ మోటార్ సైకిల్ స్క్రామ్ 411కు నెక్స్ట్ మోడల్‌గా వస్తోంది. ఇది హిమాలయన్ మోడల్ ఆధారంగా రూపొందించారు. స్క్రామ్ 411 అప్‌డేట్ అయిన వర్షన్ కొత్త స్క్రామ్ 440లో పెద్ద ఇంజిన్, అధిక పవర్, మరిన్ని ఫీచర్లు, ఆకర్షణీయమైన కొత్త రంగు ఆప్షన్లు ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది: ట్రయిల్, ఫోర్స్. ట్రయిల్ వేరియంట్ ట్యూబ్ స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్‌లతో ఉంటుంది, ఇది బ్లూ, గ్రీన్ రంగులలో దొరుకుతుంది. ఫోర్స్ వేరియంట్‌లో ట్యూబ్‌లెస్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చిన దానిని బ్లూ, గ్రే, టీల్ రంగుల్లో పొందవచ్చు. ఈ వేరియంట్లలో మరింత ఆధునిక, సౌకర్యవంతమైన సెటప్‌ను కోరుకునే రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.