కొద్ది నెలల క్రితం జియో భాటలో ఎయిర్‌టెల , ఐడియా కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌లను భారీగా పెంచడంతో ఆయా కంపెనీల కష్టమర్లు భారీగా తగ్గిపోయారు. దీంతో ప్రభుత్వ టెలికాం సంస్థ అయినబిఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌ల ను అందించడంతో బీఎస్ఎన్ఎల్ కు కష్టమర్లు భారీగా పెరిగారు. అయితే వరుసగా కొద్ది నెలల నుంచి ఆయా టెలికామ్ కంపెనీల యూజర్లు తగ్గిపోతుండటంతో కంపెనీలు అప్రమత్తం అయ్యాయి తిరిగి తమ యూజర్లను రాబట్టుకునేందుకు కొన్ని ప్లాన్‌లపై ధరలు తగ్గిస్తున్నారు.ఈ క్రమంలోనే దేశంలోనే ప్రముఖ టెలికాం కంపెనీల్లో ఒకటి అయిన ఎయిర్‌టెల్.. శనివారం రెండు రీఛార్జ్ ప్లాన్‌లపై ధరలను దగ్గించింది. ఇందులో రూ. 499 ప్లాన్ పై రూ. 30 తగ్గించడంతో ఆ ప్లాన్ రూ. 469 కు యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. దీని వ్యాలిడిటి 84 రోజులు ఉంటుంది. ఇందులో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 ఎస్ఎంఎస్ లు వస్తాయి. అలాగే రూ. 1,959 ప్లాన్ పై రూ. 110 తగ్గించింది. దీంతో ఈ ప్లాన్ 1,849 రూపాయలకు యూజర్లు అందుబాటులోకి రానుండగా.. ఈ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్ఎమ్ఎస్ లు లభించనున్నాయి. కాగా తగ్గించిన ఈ ధరలు కేవలం.. వాయిస్ కాల్స్(Voice calls) కోసం మాత్రమే రీఛార్జ్ చేసే వారికి ఉపయోగపడుతుంది.