గూగుల్ నుంచి గత సంవత్సరం మే నెలలో గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ (Google Pixel 8a Smartphone) భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా అనేక కీలక ఫీచర్‌లను కలిగి ఉంది. టెన్సార్ చిప్‌సెట్ సహా 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. విడుదల ధరతో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్ లో (Flipkart) ప్రస్తుతం సుమారు రూ.15,000 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.52,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.37,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. అంటే సుమారు రూ.15000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.