దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబును చాలా మంది పారిశ్రామికవేత్తలు కలిసి హామీ ఇచ్చారని.. దీంతో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని మంత్రి అనగాని పేర్కొన్నారు.