విశాఖలో మహిళపై కిరాతకంగా వ్యవహరించారు. ముగ్గురు వ్యక్తులు నడి రోడ్డుపై మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చి కెళ్లారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.విశాఖలోని మధురవాడ పీఎం పాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తోంది ఓ మహిళ. అయితే… పక్కనే ఉన్న దుకాణదారులు ఆమెను జుట్టుపట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకుని వెళ్లారు.అద్దె విషయంలో యజమాని .. ఆమెపై దాడి చేశారని సమాచారం అందుతోంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.