అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం పాగోలు గ్రామంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం సందర్శించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఆమె స్కూలు సందర్శించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా నియోజకవర్గ టిడిపి నాయకులు బొబ్బ గోవర్ధన్, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.