భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. కొలంబియా-అమెరికా మధ్య తాత్కాలిక ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సూచీలు భారీగా పతనం అయ్యాయి. సెన్సెక్స్ 824 పాయింట్ల నష్టంతో 75,352 వద్ద ముగియగా నిఫ్టీ సైతం 263 పాయింట్ల నష్టంతో 22,817 వద్ద స్థిరపడింది. దీంతో ఒక్కరోజులోనే రూ.8లక్షల కోట్లు ఆవిరయ్యాయి.