విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన అనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని అఖిల పక్ష విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు.
పి. డి. ఎస్. యూ జిల్లా కార్యదర్శి వీరేంద్ర మాట్లాడుతూ నారాయణ కళాశాలలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలపై చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఆర్. ఐ. ఓ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.