2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. జగన్ లండన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కీలన నేత విజయసాయి రెడ్డి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి సడెన్ షాకిచ్చారు.
అయితే విజయసాయి రెడ్డి బాటలోనే వైసీపీ మాజీ మంత్రులు, కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది వైసీపీ కీలక నేతలు కూటమిలోని పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు ఏపీలో టాక్ నడుస్తోంది.