కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పాతన్న అనే దళితుడికి చెందిన రెండు ఎకరాల భూమిని అగ్ర కులస్తులు ఆక్రమించారని వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించు గ్రీవెన్స్ డే లో ఆర్డీవో వసంత బాబుకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గురుమూర్తి, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలిమప్ప తదితరులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.