అనంతపురం ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు రషీద్ భాష ఆధ్వర్యంలో జేజే కన్వెన్షన్ హాల్లో 7వ లఘు చిత్రోత్సవ వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా మీనాక్షమ్మ ఫౌండేషన్ చైర్మన్ రవికాంత్ రమణ, అబ్బా టీవీ హరిప్రసాద్, సుధీర్ తదితరులు హాజరయ్యారు.
కొత్త కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం అవార్డు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 85 లఘు చిత్రాలు కాంపిటీషన్‌కి రాగ ఎంపికైన చిత్రాలకు ఫిబ్రవరి 2న అవార్డులు అందజేస్తారు.