నారా లోకేష్ యువగళం పాదయాత్రకు నేటితో రెండేళ్లు పూర్తి కావడంతో ప్రముఖ చిత్రకారిణీ తేజశ్రీ నవధాన్యాలతో లోకేష్ చిత్రాన్ని వేశారు. నవధాన్యాలను ఉపయోగించి ఆరు అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో అద్భుతంగా చిత్రపటాన్ని రూపొందించారు.
దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. అద్భుతమైన కళాఖండం రూపొందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీని తయారీకి ఆమె చేసిన కృషి, చూపిన నిబద్ధతను అభినందిస్తున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు.