నీతి ఆయోగ్ రిపోర్టుపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు సోమవారం కౌంటర్ ఇచ్చారు. 'ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. అప్పుల పేరుతో చంద్రబాబు పథకాలు అమలు చేయడం లేదు. ప్రజలను భ్రమల్లో పెట్టి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. అప్పులున్నా హామీలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు చేయలేమని అంటున్నారు' అని అంబటి మండిపడ్డారు.