అండర్-19 మహిళల వరల్డ్ కప్ (U19 Women World Cup 2025)లో భారత అమ్మాయిలకు ఎదురులేకుండా పోయింది. సూపర్ సిక్స్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించంది. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్‌లో సెంచరీ చేసిన త్రిష.. బౌలింగ్‌లోనూ కీలకమైన మూడు వికెట్లు పడగొట్టింది. దీంతో స్కాట్లాండ్ను భారత్ 150 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలిపోయింది. ఓపెనర్లు పిప్పా (12), వాల్‌సింగమ్ (12), పిప్పా స్ప్రౌల్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. భారత్ బౌలర్లలో శుక్ల 4 వికెట్లు పడగొట్టగా, వైష్ణవి శర్మ, త్రిష చెరో 3 వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. వరల్డ్ కప్‌లో ఇప్పటికే భారత్ సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. జనవరి 31న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
తెలుగు యువ క్రికెటర్ గొంగడి త్రిష (110*: 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) రికార్డు సెంచరీ బాదింది. కేవలం 53 బంతుల్లోనే శతకం చేసింది. దీంతో అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్‌లోనూ త్రిష నాణ్యమైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తోంది. ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్న భారత్.. సూపర్ సిక్స్‌లో తన చివరి మ్యాచ్‌లోనూ భారీ స్కోరు చేసింది. ఇది కూడా అండర్ 19 టీ20ల్లో రికార్డే.